HomeTelugu Trending'గద్దలకొండ గణేష్'పై మహేష్‌ ప్రశంసలు

‘గద్దలకొండ గణేష్’పై మహేష్‌ ప్రశంసలు

8 19మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్‌ నటించిన ‘గద్దలకొండ గణేష్’ సెప్టెంబర్ 20వ తేదీన విడుదల అయ్యింది. వరుణ్ తేజ్ నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. మాస్ లుక్స్ తో ఆకట్టుకోవడంతో పాటు కథ పరంగా కూడా కొత్తగా ఉండటంతో సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. సినిమాను చూసిన ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. కాకుంటే నిడివి కొద్దిగా ఎక్కువగా ఉండటమే సినిమాకు మైనస్ పాయింట్. అది మినహాయిస్తే సినిమాకు ఎలాంటి పేరు పెట్టాల్సిన అవసరం లేదు.

ఈ సినిమాను మహేష్ బాబు చూశారట. సినిమా చాలా బాగా నచ్చిందని, ముఖ్యంగా వరుణ్ తేజ్ నటనతో ఆకట్టుకున్నాడని ట్వీట్ చేశారు. దర్శకుడు హరీష్ శంకర్ సినిమా తీసిన విధానం ఆకట్టుకుందని పేర్కొన్నారు. 14రీల్స్ నిర్మాణ విలువలు బాగున్నాయని చెప్పి ట్వీట్ చేశారు. మహేష్ బాబు ట్వీట్ తో సినిమాకు మరింత మైలేజ్ వస్తుందని చెప్పొచ్చు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu