HomeTelugu Trendingఖైదీ పై మహేష్‌ ప్రశంసలు

ఖైదీ పై మహేష్‌ ప్రశంసలు

8 1

కార్తీ హీరోగా నటించిన ప్రయోగాత్మక చిత్రం ఖైదీ అటు తమిళం మరియు తెలుగులో కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ కేవలం ఒక రాత్రి నడిచే యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ డ్రామాగా దీనిని తెరకెక్కించారు. ఈ మధ్య మహేష్ ఏ మంచి సినిమాని ప్రశంసించకుండా ఉండడం లేదు. ఆయన ఓ పక్క షూటింగ్ లో పాల్గొంటూనే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా మంచి సినిమా అనిపిస్తే దానిపై స్పందిస్తున్నారు. కాగా తాజాగా గతవారం విడుదలైన ఖైదీ చిత్రం పై ట్విట్టర్ వేదికగా ప్రసంశలు కురిపించారు. కొత్త తరహా మేకింగ్ అని, సినిమాలో పోరాట సన్నివేశాలు బాగున్నాయని నటీనటుల నటన అద్భుత్బంగా ఉందని పేర్కొన్నారు. పాటలు లేకుండా సినిమా రావడం ఆహ్వానించదగ్గ మార్పు అని పేర్కొన్న మహేష్ చిత్ర సభ్యులు అందరికి అభినందనలు తెలిపారు. ఇక మహేష్ సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేష్ సరసన రష్మిక టిస్తుండగా, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu