HomeTelugu Big Storiesపారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు.. మహేష్‌ ట్వీట్స్‌

పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు.. మహేష్‌ ట్వీట్స్‌

2 16
టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు.. ప్రమాదం నుంచి మనల్ని తప్పించడం కోసం తమ సొంతవాళ్లను సైతం వదిలిపెట్టి వచ్చి వీధుల్లో శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన పలు ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేస్తూ పలు ట్వీట్లు పెట్టారు.

‘మన చుట్టూ ఉన్న పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కోసం ఈ ట్వీట్‌. మనం మన ఇళ్లలో చాలా భద్రంగా ఉంటున్నాం. వాళ్లు మాత్రం తమ సొంతవాళ్లను వదులుకుని మనల్ని ప్రమాదం బారిన పడకుండా చేయడం కోసం రోజూ ఇంటి నుంచి బయటకు వస్తున్నారు. కంటికి కనిపించని భయంకరమైన వైరస్‌తో ప్రస్తుతం మనందరం ఎంతో పోరాటం చేస్తున్నాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మన కోసం ఎంతో శ్రమించి పనిచేస్తున్నారు. వాళ్లందరికీ మనస్ఫూర్తిగా గౌరవం, ప్రేమాభిమానంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.’ అని మహేశ్‌ ట్వీట్లు చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu