HomeTelugu Big Stories9 గర్భిణి అండర్ వాటర్‌లో బికినీ షూట్.. వైరల్‌ అవుతున్న సమీరారెడ్డి ఫొటోలు

9 గర్భిణి అండర్ వాటర్‌లో బికినీ షూట్.. వైరల్‌ అవుతున్న సమీరారెడ్డి ఫొటోలు

14 2నటి సమీరారెడ్డి అమ్మతనంలో కమ్మదనాన్ని ఆస్వాదిస్తోంది. ప్రస్తుతం 9 నెలల నిండు గర్భిణిగా ఉన్న సమీరా రెడ్డి.. మాతృత్వంలోని మాధుర్యాన్ని జీవితాంతం గుర్తుకుండేలా ప్రతిక్షణాన్ని పదిలపరుచుకుంటోంది. తన ప్రెగ్నెన్సీకి సంబంధించి ఎప్పటికప్పుడు నెటిజన్లకు టచ్‌లో ఉండే సమీరారెడ్డి.. 9 నెలల నిండు గర్భిణిగా బికినీతో నీటి అడుగున ఫొటో షూట్ నిర్వహించి సంచలనం గా మారింది.

ఇదో అందమైన అమూల్యమైన ఫీలింగ్ అంటూ అండర్ వాటర్‌లో బికినీ ధరించి బేబీ బంప్‌తో ఫొటోలకు పోజులు ఇచ్చింది సమీరారెడ్డి. మనం ఎప్పుడైతే జీవితంలో భయపడి, అలసిపోయి, ఎగ్జెట్ అవుతామో.. ఖచ్చితంగా అవి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. వాటిని పదిలంగా దాచుకోవాలి. అందుకే ఇందుకే ఇప్పుడు నీటి అడుగున ధైర్యంగా బేబీ బంప్‌తో ఫొటో షూట్ నిర్వహించారు సమీరారెడ్డి. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.


సమీరారెడ్డి తెలుగులో నరసింహుడు, జై చిరంజీవ, అశోక్ తదితర చిత్రల్లో నటించగా.. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమీరారెడ్డి అక్షయ్ వర్దే అనే బిజినెస్ మ్యాన్‌ని వివాహం చేసుకుంది. వీరికి నాలుగేళ్ల కొడుకు ఉండగా.. రెండోసారి గర్భం దాల్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!