నేను మిమ్మల్ని ఇంకా గర్వపడేలా చేస్తాను నాన్నా.. మహేష్ ఎమోషనల్ పోస్ట్

లెజెండరీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ (79) ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించగా.. యావత్ చిత్రసీమ ఆయనకు ఘన నివాళి అర్పించింది. అభిమానులతో పాటు ఆయన మరణం ఘట్టమనేని ఫ్యామిలీకి తీరని వేదన మిగిల్చింది. ఇప్పటికే మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ మరియు పిల్లలు గౌతమ్ – సితార సోషల్ మీడియాలో కృష్ణతో ఉన్న అనుబంధం గురించి ఎమోషనల్ నోట్ షేర్ చేసారు.

తాజాగా మహేష్ బాబు తన తండ్రిని గుర్తు చేసుకుంటూ తొలిసారిగా సోషల్ మీడియాలో స్పందించారు. కృష్ణ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. ఓ ఎమోషనల్ నోట్ ని పంచుకున్నారు. “మీ జీవితం గొప్పగా సెలబ్రేషన్ గా సాగింది. ఇది మీ గొప్పతనం. మీరు మీ జీవితాన్ని నిర్భయంగా గడిపారు. డేరింగ్ అండ్ డాషింగ్ మీ స్వభావం. నా స్ఫూర్తి నా ధైర్యం.. నేను చూసుకున్నదంతా.. నిజంగా ముఖ్యమైనవన్నీ అలాగే వెళ్లి పోయాయి. కానీ విచిత్రమేమిటంటే నేను ఇంతకుముందెన్నడూ లేనంత బలంగా ఉన్నాననిపిస్తోంది. ఇప్పుడు నేను నిర్భయంగా ఉన్నాను. మీ కాంతి నాలో ఎప్పటికీ ప్రకాశిస్తుంది. నేను మీ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళతాను. నేను మిమ్మల్ని ఇంకా గర్వపడేలా చేస్తాను. లవ్ యూ నాన్నా. మై సూపర్ స్టార్” అని మహేష్ తన ప్రకటనతో భావోద్వేగానికి గురి చేసారు. దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబుకు ధైర్యం చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఘట్టమనేని కుటుంబంలో మూడు విషాదాలు చోటు చేసుకోవడం దురదృష్టకరం.

CLICK HERE!! For the aha Latest Updates