HomeTelugu Trendingగోవాలో 'సర్కారువారి పాట' యాక్షన్ ఎపిసోడ్

గోవాలో ‘సర్కారువారి పాట’ యాక్షన్ ఎపిసోడ్

Mahesh sarkaruvari paata sh
సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు హీరోగా పరశురామ్ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’. మైత్రీ .. 14 రీల్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. తాజాగా మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా, ‘బర్త్ డే బ్లాస్టర్’ పేరుతో ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయగా అనూహ్యమైన స్పందన వచ్చింది.

తాజాగా ఈ సినిమా తదుపరి షెడ్యూల్ షూటింగ్ ‘గోవా’లో మొదలైంది. మహేశ్ బాబు తదితరులపై ఒక యాక్షన్ ఎపిసోడ్ ను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ.. ఈ సినిమా టీమ్ వర్కింగ్ స్టిల్ ను విడుదల చేసింది. రామ్ లక్ష్మణ్ డిజైన్ చేసిన ఈ యాక్షన్ ఎపిసోడ్ ఆసక్తిని రేకెత్తిస్తుందని చెబుతున్నారు. తమన్ సంగీతం ఈ సినిమాకి హైలైట్‌ అవుతుంది అని అంటున్నారు. అలాగే మహేశ్ బాబుతో కీర్తి సురేశ్ కెమిస్ట్రీ బాగా కుదిరిందని చెబుతున్నారు. యాక్షన్ .. ఎమోషన్ .. రొమాన్స్ .. కామెడీతో కూడిన ఈ సినిమాను ‘సంక్రాంతి’ కానుకగా జనవరి 13వ తేదీన విడుదల చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu