HomeTelugu Big Storiesనర్సుల దినోత్సవం సందర్భంగా మహేష్‌ బాబు ట్వీట్

నర్సుల దినోత్సవం సందర్భంగా మహేష్‌ బాబు ట్వీట్

Mahesh tweets on internatio
నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. ఈ సందర్భంగా పలువురు సెలెబ్రిటీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నర్సులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నర్సులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో కోవిడ్-19 సెకండ్ వేవ్‌తో పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ లోని మా నర్సులందరికీ కోసం ఇది… మీ అసాధారణ సహకారం అసమానమైనది. మీ కరుణ, తాదాత్మ్యం, బలంతో ప్రపంచాన్ని స్వస్థపరిచినందుకు, ఎన్నడూ ఆశను కోల్పోవద్దని మాకు నేర్పించినందుకు ధన్యవాదాలు. మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతతో మీకు మద్దతుగా నిలబడతాము” అంటూ ట్వీట్ చేశారు మహేష్ బాబు. లాక్ డౌన్ విషయంలోనూ అందరూ బాధ్యతగా మెలగాలంటూ మహేష్ ట్వీట్ చేశారు. “కోవిడ్-19 సెకండ్ వేవ్ మనందరికీ ఒక సవాలుగా మారింది. అందరం బాధ్యతగా ఉందాం. మన రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రోటోకాల్స్ ను అనుసరించాలని నేను మీ అందరిని కోరుతున్నాను” అని మహేష్‌ అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu