HomeTelugu Reviewsరివ్యూ: మజ్ను

రివ్యూ: మజ్ను

రేటింగ్: 3/5
ప్రధాన తారాగణం: నాని, అను ఇమ్మానుయేలు, ప్రియ, రాజమౌళి, పోసాని కృష్ణ‌మురళి,
వెన్నెల కిషోర్, సప్తగిరి, సత్యకృష్ణ‌ తదితరులు.
నిర్మాతలు: గీతా గోళ్ల, పి. కిరణ్
కథ, కథనం, దర్శకత్వం: విరించి వర్మ
సంగీతం: గోపిసుందర్
ఛాయాగ్రహణం: జ్ఞాన‌శేఖ‌ర్‌
వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని, ఉయ్యాలా జంపాలా వంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీను
ప్రేక్షకులకు అందించిన దర్శకుడు విరించి వర్మ కలిసి రూపొందించిన చిత్రం ‘మజ్ను’. ఇప్పటివరకు
మజ్ను అంటే విషాధంతో కూడిన ప్రేమకథలే అనుకున్నారు. మా సినిమాతో దాని అర్ధాన్నే
మార్చబోతున్నాం అని నమ్మకంగా చెప్పిన చిత్రబృందం ఆ నమ్మకాన్ని నిజం చేసిందో
లేదో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
ఆదిత్య(నాని) ‘బాహుబలి’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తుంటాడు. ఒకరోజు సుమా(ప్రియాశ్రీ)
అనే అమ్మాయిని చూసి ఆకర్షితుడవుతాడు. ప్రియాకు మాత్రం ప్రేమంటే అసలు నచ్చదు. ప్రేమకథలంటే
చాలా ఇష్టం. ఈ నేపధ్యంలో ఆదిత్య, సుమను ఇంప్రెస్ చేయడానికి తన ప్రేమ కథను చెబుతాడు.
ఆదిత్య తన చదువు పూర్తిచేసుకొని తన స్నేహితులతో సరదాగా ఎంజాయ్ చేసి వస్తుండగా.. దారిలో
కిరణ్(అను ఎమాన్యుయల్) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. తన ప్రేమ కథను మొత్తం
సుమకు చెప్పే ప్రాసెస్ లో ఆదిత్య తను ఇంకా కిరణ్ నే ప్రేమిస్తున్నాడన్న విషయాన్ని రియలైజ్
అవుతాడు. ఆ విషయం కిరణ్ కు చెప్పడానికి బయలుదేరతాడు. సడెన్ గా సుమా, కిరణ్ లు
కలిసి ఆదిత్యకు కనిపించడంతో షాక్ అవుతాడు. ఆ తరువాత ఏం జరిగింది..? కిరణ్, ఆదిత్యను
ప్రేమిస్తూనే ఉందా..? ఇంతకీ సుమా సంగతేంటి..? ఆదిత్య ఫైనల్ గా ఎవరితో తన జీవితాన్ని
షేర్ చేసుకుంటాడు..? అనే అంశాలతో సినిమా నడుస్తుంటుంది.
నటీనటుల పనితీరు:
నాని తన న్యాచురల్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టేశాడు. ప్రతి సీన్ లో తనదైన మార్క్ ను క్రియేట్ చేశాడు.
ఎమోషనల్ సీన్స్ ను ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పడం నాని స్పెషాలిటీ. ఈ సినిమాలో కూడా తన
నటనతో ప్రేక్షకులను నవ్వించాడు.. మెప్పించాడు. అను ఎమాన్యుయల్, ప్రియాశ్రీలకు మొదటి
సినిమా అయినా.. తమ నటనతో ఓకే అనిపించారు. అనుని సంప్రదాయకంగా చాలా అందంగా
చూపించారు. సత్య, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురలిలు తమ కామెడీతో ప్రేక్షకులను నవ్వించారు.
నాని, వెన్నెల కిషోర్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్లస్ అవుతాయి. హీరోగా నటిస్తున్న
రాజ్ తరుణ్ సినిమాను సపోర్ట్ చేయడానికి అతిథి పాత్రలో నటించడం విశేషం. రెండు, మూడు
సీన్లలో కనిపించి ఆకట్టుకుంటాడు.
సాంకేతికవర్గం పనితీరు:
డైరెక్టర్ విరించి వర్మ ఎమోషన్స్, ఫీలింగ్స్ ను జోడించి ఓ కథను రాసుకున్నాడు. దీన్ని ట్రాయాంగల్
లవ్ స్టోరీ అని చెప్పలేము.. కానీ ఒక రకంగా అదే. ప్యూర్ లవ్ స్టోరీను నేటి యువతకు చెప్పడానికి
ఆయన చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే. లవ్ లెటర్స్ అనే కాన్సెప్ట్ ను ఇప్పటి ట్రెండ్ ఎప్పుడో
మర్చిపోయింది. మరోసారి లెటర్ కు ఉన్న పవర్ ను ఈ సినిమాలో చూపించాడు. దానికి తగ్గ
స్క్రీన్ ప్లే.. అక్కడక్కడా కొంచెం స్లో గా అనిపించినప్పటికీ.. కథకు కనెక్ట్ అవడంతో ఆలోపం పెద్దగా
కనిపించదు. జ్ఞానశేఖర్ ఫోటోగ్రఫి అందంగా ఉంది. గోపిసుందర్ తన మ్యూజిక్ తో సినిమాను మాయ
చేశాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచింది. కొన్ని సన్నివేశాలను ఎడిట్ చేయాల్సివుంది.
నిర్మాణ విలువలు బావున్నాయి.
మొత్తానికి..
ప్రేమ కథ అని ఫ్యామిలీస్ చూసే సినిమా కాదనుకోకండీ .. ఏ వర్గపు ఆడియన్స్ కు అయినా.. ఈ
సినిమా కనెక్ట్ అవుతుంది. ఒక్కసారి తమ జ్ఞాపకాలను గుర్తుచేసే సినిమా. ముఖ్యంగా యూత్ కు
ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu