రివ్యూ: ఇజం

బ్యానర్: ఎన్టీఆర్ ఆర్ట్స్
నటీనటులు: కల్యాణ్ రామ్, అదితి ఆర్య, తనికెళ్ళ భరణి, జగపతి బాబు, పోసాని కృష్ణమురలి
తదితరులు..
సంగీతం: అనూప్ రూబెన్స్
ఫోటోగ్రఫీ: ముఖేష్
దర్శకత్వం: పూరీ జగన్నాథ్
కల్యాణ్ రామ్, అదితి ఆర్య జంటగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఇజం’.
శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎంతవరకు మెప్పించిందో.. సమీక్షలోకి
వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
సత్యమార్తాండ్(కల్యాణ్ రామ్) ఓ వెబ్ సైట్ ను ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఎన్నో వెలుగు
చూడని కుంభకోణాలను, ఇల్లీగల్ వ్యాపారాలను బయటపెడుతూ ఉంటాడు. అతడెలా ఉంటారనే
విషయం ఎవరికి తెలియదు. ఇది ఇలా ఉండగా.. జావీద్ ఇబ్రహీం(జగపతిబాబు) అన్ని దేశాలలో
తన మాఫియాను రన్ చేస్తుంటాడు. బ్యాంక్ ఆఫ్ ప్యారడైజ్ అనే పేరుతో ఒక ఐలాండ్ లో
బ్యాంక్ ను ఏర్పాటు చేసి ఎందరో అక్రమంగా సంపాదించిన డబ్బును తన అండర్ లో
మైంటైన్ చేస్తుంటాడు జావీద్. అతడికి అలియా ఖాన్(అతిదీ ఆర్య) అనే కూతురు ఉంటుంది.
అలియా అంటే జావీద్ కు ప్రాణం. ఓ రోజు అలియా తన ఫ్రెండ్ తో బయటకి వెళ్లినప్పుడు
కల్యాణ్ రామ్ అనే వ్యక్తి కనిపిస్తాడు. తనను ప్రేమిస్తున్నానంటూ.. వెంట పడతాడు. అలియాకు
కల్యాణ్ అంటే చిరాకు పుడుతుంది. ఆ విషయాన్ని తన తండ్రికి కూడా చెబుతుంది. జావీద్
అతడ్ని చంపాలని భావిస్తాడు. అయినా.. సరే కల్యాణ్ రామ్ మాత్రం అలియాను ప్రేమించడం
మానడు. అసలు కల్యాణ్ రామ్ ఎవరు..? అలియాను అతడు నిజంగానే ప్రేమిస్తున్నాడా..?
లేక వేరే ఇంటెన్షన్ తో అలియాకు దగ్గరవ్వడానికి ప్రయత్నించాడా..? సత్య మార్తాండ్, కల్యాణ్ రామ్
ఇద్దరూ ఒక్కరేనా..? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!
విశ్లేషణ:
హీరో, హీరోయిన్ ను ప్రేమించడం తన ప్రేమ కోసం ఆ అమ్మాయి చుట్టూ తిరగడం వంటి సన్నివేశాలతో
సినిమా మొదటి భాగం ముగుస్తుంది. అసలు కథ రెండో భాగంలో మొదలవుతుంది. బ్లాక్ మనీ,
రాజకీయనాయకులు వంటి సెన్సిటివ్ ఇష్యూను తీసుకొని సినిమాగా చేయాలనుకున్నాడు
పూరీ జగన్నాథ్. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడని అనిపించక మానదు.
తన స్టయిల్ లో డైలాగ్స్, స్క్రీన్ ప్లే రాసుకున్నప్పటికీ.. సెకండ్ హాఫ్ లో మాత్రం ప్రేక్షకులకు
విసుగు పుట్టించేస్తాడు. ఫస్ట్ హాఫ్ ఉన్నంత ఎంటర్టైనింగ్ గా సెకండ్ హాఫ్ ఉండదు. ఎథికల్ హ్యాకింగ్
ను మెయిన్ పాయింట్ గా తీసుకొని కథను నడిపించాడు. హ్యాకింగ్ చేసి అందరూ అక్రమంగా
సంపాదించి దాచుకున్న డబ్బును ప్రజలకు ఓ జర్నలిస్ట్ తన తెలివితేటలతో పంచి పెడతాడు.
ఈ పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ కథనంలో కొత్తదనం లేకపోవడంతో పెద్దగా కనెక్ట్ కాలేదు.
కోర్టు సీన్ కూడా అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు. కల్యాణ్ రామ్ తన లుక్స్ తో నటనతో
ఆకట్టుకున్నాడు. అదితికి మొదటి చిత్రమయినప్పటికీ తన నటనతో పర్వాలేదనిపించుకుంది.
మాఫియా డాన్ గా జగపతిబాబు నటన సెటిల్డ్ గా ఉంది. పోసాని, అలీ ప్రేక్షకులను బాగానే
ఎంటర్టైన్ చేశారు. ప్రధానమైన మూడు పాత్రల చుట్టూనే కథ నడుస్తుంది. ఫోటోగ్రఫీ చాలా
బావుంది. కొన్ని షాట్స్ రిచ్ గా అనిపిస్తాయి. చోపర్ సన్నివేశాలు కొత్తగా అనిపిస్తాయి. మ్యూజిక్
మరీ కాకపోయినా.. రెండు పాటలు ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.
రేటింగ్: 2.75/5

CLICK HERE!! For the aha Latest Updates