టాప్‌లెస్‌ ఫొటో షేర్‌ చేసిన మలైకా అరోరా

బాలీవుడ్‌లో మలైకా అరోరా ఐటమ్ గర్ల్‌గా ఎంత పాపులరో అందరికీ తెలిసిందే కదా. షారుఖ్ ఖాన్ ‘దిల్ సే’ సినిమాలోని..చయ్య..చయ్య.. సాంగ్‌కు డ్యాన్స్ చేసి..హిందీ సినిమా ప్రేక్షకుల్నీ మైమరిపించింది. తెలుగులో మాత్రం మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘అతిథి’లో తొలిసారి ఐటెం సాంగ్ చేసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘గబ్బర్ సింగ్’ లో చేసిన కెవ్వుకేక పాటతో తెలుగు ప్రేక్షకులను నిజంగానే కెవ్వుకేక పుట్టించేలా చేసింది. ఈమె ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ తమ్ముడు ఆర్భాజ్ ఖాన్‌ను ప్రేమ వివాహాం చేసుకుంది.

ఆ తర్వాత వాళ్ల పంతోమ్మిదేళ్ల వివాహా బంధానికి పుల్‌స్టాప్ చెప్పింది హాట్‌ బ్యూటీ. ప్రస్తుతం ఆ భామ బోనీ కపూర్ కుమారుడు అర్జున్ కపూర్‌తో గత కొన్ని రోజులుగా డేటింగ్‌లో ఉంది. అర్జున్ కపూర్.. మలైక కంటే 12 ఏళ్లు తేడా. ప్రస్తుతానికి పెళ్లి విషయం పక్కన పెట్టిన వీళ్లిద్దరు విదేశాల్లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఎప్పటికప్పుడు తన విశేషాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే మలైక అరోరా..తాజాగా ఎపుడో కొన్నేళ్ల క్రితం దిగిన త్రోబ్యాక్ టాప్‌లెస్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.