HomeTelugu Trendingదర్శకేంద్రుడి 'పెళ్లిసందడి'లో హీరోయిన్‌ ఈమేనా!

దర్శకేంద్రుడి ‘పెళ్లిసందడి’లో హీరోయిన్‌ ఈమేనా!

Malavika Nair as the heroinదర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ వహిస్తుండగా.. గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నటి ‘పెళ్లిసందడి’ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. తాజాగా హీరోయిన్‌ను కూడా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మలయాళ బ్యూటీ మాళవిక నాయర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. మొదట్లో కొత్త హీరోయిన్‌ను ఎంపిక చేస్తారని అనుకున్నప్పటికీ, చివరికి మాళవికను ఎంపిక చేశారు. ఆర్కా మీడియా వర్క్స్ సంస్థతో కలసి రాఘవేంద్రరావు సోదరుడు కృష్ణమోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో షూటింగును ప్రారంభించుకునే ఈ ‘పెళ్లిసందడి’ మరెంతటి సంచలనాన్ని సృష్టిస్తుందో చూడాలి!

Recent Articles English

Gallery

Recent Articles Telugu