దాసరితో పవన్ ప్రాజెక్ట్ డౌటే..!

పవన్ ఎన్నికలలోపు వీలైనన్ని సినిమాలు చేసి ఆర్థికంగా స్థిర పడాలని ఫిక్స్ అయ్యారు.ఈ నేపధ్యంలో ప్రస్తుతం కాటమరాయుడు సినిమాలో నటిస్తున్నాడు. దీని తరువాత మరో మూడు సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి. ముందుగా త్రివిక్రమ్ తరువాత నేసన్ సినిమాలు చేయనున్నాడు. వీటితో పాటు మైత్రీ మూవీస్ బ్యానర్ లో కూడా సినిమా చేయాల్సివుంది. ఈ మూడు కాకుండా నిర్మాత దానయ్య అడ్వాన్స్ కూడా పవన్ దగ్గరుంది.

అయితే ఎప్పటినుండో దాసరి నారాయణరావు నిర్మించే సినిమాలో పవన్ హీరోగా నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ పవన్ కమిట్ అయిన సినిమాలు పూర్తయ్యే సరికి 2018 డాతెస్తుంది. అప్పటికి అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పవన్,దాసరి సినిమాను లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనకు చేరవేసినట్లు టాక్. మొత్తానికి పవన్ తో సినిమా చేయాలనుకున్న దాసరి కల నెరవేరకుండానే పోతుంది..!