HomeTelugu Trending''మళ్ళీ మొదలైంది''ట్రైలర్‌

”మళ్ళీ మొదలైంది”ట్రైలర్‌

Malli Modalaindi Trailer
అక్కినేని హీరో సుమంత్ నటిస్తున్న తాజాగా చిత్రం ”మళ్ళీ మొదలైంది”. టీజీ కీర్తి కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నైనా గంగూలీ హీరోయిన్ గా నటిస్తోంది. సుమంత్ రెండో పెళ్లి వార్తలతో ఈ మూవీకి బోలెడంత పబ్లిసిటీ లభించింది. అలానే విడాకుల తర్వాత జీవితాన్ని చూపించబోతున్నామంటూ వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఈ క్రమంలో తాజాగా చిత్ర ట్రైలర్ ను సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు.

విడాకులు తీసుకున్న తర్వాత ఓ వ్యక్తి జీవితంలో జరిగిన ప్రేమ – ఇతరులు అతని పై చూపించే సానుభూతి వంటి అంశాలను ఈ ట్రైరల్‌లో ప్రస్తావించారు. ఈ సినిమాలో సుహాసిని మణిరత్నం, మంజుల ఘట్టమనేని, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, అన్నపూర్ణ, తాగుబోతు రమేష్ ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. అనుప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రెడ్ సినిమాస్ చరణ్ తేజ్ సమర్పణలో కె. రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu