HomeTelugu Trending'మళ్లీ మొదలైంది' నుండి సుహాసిని ఫస్ట్‌లుక్‌

‘మళ్లీ మొదలైంది’ నుండి సుహాసిని ఫస్ట్‌లుక్‌

suhasini first look from Ma

నటి సుహాసిని చాలా రోజుల తరువాత ‘మళ్లీ మొదలైంది’ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ విషయాన్ని ప్రకటించింది చిత్ర బృందం. ఆమె పాత్ర పై క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ఆమె పాత్ర గుణగణాలని వివరించారు. ఇందులో ఆమె సుజా అనే స్ఫూర్తిమంతమైన తల్లి పాత్రని పోషిస్తున్నారు. వ్యాపారవేత్తగా కనిపించనున్నారు. అయితే సుహాసిని హీరో తల్లిగా నటిస్తుందా..లేక హీరోయిన్‌ తల్లిగా కనిపిస్తారా అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. సుమంత్‌, నైనా గంగూలీ హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమాకు టి.జి. కీర్తి కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. విడాకులు తీసుకోవడం, మళ్లీ పెళ్లి చేసుకోవడం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంతో తొలిసారి తెలుగు తెరపై విభిన్న కథని చూపించబోతున్నారు. కె. రాజశేఖర్‌ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు.

Senior actress in a bold and strong role in Malli Modalindi

Recent Articles English

Gallery

Recent Articles Telugu