HomeTelugu Trendingవాల్యు లేని 'జాతిరత్నాలు' లిరికల్‌ వీడియో సాంగ్‌

వాల్యు లేని ‘జాతిరత్నాలు’ లిరికల్‌ వీడియో సాంగ్‌

Mana JathiRatnalu Lyrical

నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జాతిరత్నాలు’. అనుదీప్ కేవీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శివరాత్రి స్సందర్భంగా మార్చి 11న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్ ‘మన జాతిరత్నాలు’ లిరికల్ వీడియో చిత్రబృందం విడుదల చేసింది.

‘వాల్యూ లేని వజ్రాలు మన జాతిరత్నాలు’ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఎంతగానే ఆకట్టుకుంటుంది. రథన్ సంగీతం అందించాడు. జాతిరత్నాలు నేపథ్యాన్ని తెలియజేసేలా లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించాడు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను ఆలపించాడు. స్వప్న సినిమాస్ బ్యానర్ పై ‘మహానటి’ మేకర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu