HomeTelugu Trendingమామిడి చెట్టెక్కిన మంచు లక్ష్మి!

మామిడి చెట్టెక్కిన మంచు లక్ష్మి!

7 22
లాక్‌డౌన్‌ నేపద్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్‌డౌన్‌లో సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే సెలబ్రిటీలు మాత్రం ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ కాలాన్ని తమకు నచ్చినట్టుగా ఉపయోగించుకుంటున్నారు. ఇంట్లో చేసే కొన్ని పనులను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ వారిని ఖుషి చేస్తున్నారు. మీరూ ఇంట్లోనే ఉండండి. కరోనా నుంచి బయటపడేందుకు ఇదే మంచి మార్గం అంటున్నారు. అయితే కొంతమంది మాతరం వంట పనుల్లో, ఇంటిపనుల్లో బిజీ అవుతూ కాలాన్ని గడుపుతున్నారు.

ఇదిలా ఉంటే లాక్‌డౌన్ సమయం మంచు వారి అమ్మాయి లక్ష్మి ఏకంగా చెట్లు కూడా ఎక్కేస్తుంది. ఇటీవల తన కూతురు విద్యా నిర్వాణ కోసం లక్ష్మి ఇంటి ముందు ఉన్న మామిడి చెట్టు ఎక్కింది. విద్యా మామిడిపండు కావాలని ఆశగా అడిగిందట. దాంతో స్వయంగా తానే చెట్టు ఎక్కి మరీ కోసి విద్యా చేతికి అందించింది. ఈ చెట్టు తన చిన్నప్పటి నుంచి ఉన్నా ఏ రోజూ దానిని పలకరించలేదట. కనీసం దాని దగ్గర కాసేపు కూడా గడపలేదట. అలాంటిది లాక్‌డౌన్‌లో ఎలాంటి పనులు లేకపోవడంతో ఇంట్లో ఉన్న ప్రతి చెట్టుని పలకరిస్తున్నఅంటున్నది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu