HomeTelugu Trendingదేవర: కీలక పాత్రలో మంచు లక్ష్మీ!

దేవర: కీలక పాత్రలో మంచు లక్ష్మీ!

Manchu Lakshmi play key rol
ఎన్టీఆర్‌-కొరటాల కాంబినేషన్‌లో ‘దేవర’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలసిందే. ఇండియన్‌ సినీ చరిత్రలో ఇప్పటివరకు మనం చూడని యాక్షన్ సీన్లను దేవర టీమ్ డిజైన్‌ చేస్తుందట. తారక్‌ సైతం వాటికోసం ప్రత్యేకించి శిక్షణ కూడా తీసుకుంటున్నాడట. ఇక అండర్‌ వాటర్‌ సీన్‌ అయితే మరో అద్భుతమట. సిల్వర్ స్క్రీన్‌పై ఆ సన్నివేశం చూసినప్పుడు సీట్లలో ఒక్కరు కూడా కూర్చోరట. ఈ వార్తలు ఎన్టీఆర్‌ అభిమానుల్లోనే కాదు సగటు ప్రేక్షకులలో సైతం అంతులేని అంచనాలు నెలకొల్పుతున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుగుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్‌ సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఈ సినిమాలో మంచు లక్ష్మీ ఓ కీలక పాత్ర చేయబోతున్నట్లు టాక్‌. దేవరలో ఎన్టీఆర్‌కు ఒక అక్క ఉంటుందట. ఆ పాత్రే సినిమాను నడిపిస్తుందట. ఇక అదే రోల్‌ మంచు లక్ష్మి దగ్గరికి వెళ్లిందట. తను కూడా ఆపాత్రలో నటించడానికి అంగీకరించిన్నట్లే తెలుస్తుంది. ఒకవేళ అదే గనుక నిజమైతే మంచు లక్ష్మి క్రేజ్ పాన్‌ ఇండియా లెవల్‌కు వెళ్లడం ఖాయం.

సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుంది. ఈ సినిమాలో సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా కనిపించబోతున్నాడు. యువ సుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న పాన్‌ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా ఈ సినిమాను రిలీజ్‌ చేయబోతున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!