HomeTelugu Trendingమంచు విష్ణు మూవీనుంచి తప్పుకున్న హీరోయిన్

మంచు విష్ణు మూవీనుంచి తప్పుకున్న హీరోయిన్

Manchu Vishnu Kannappa
మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ ‘కన్నప్ప’. ఇది మంచు విష్ణు యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్ ఇటీవలే గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ కూడా పాల్గొన్నారు.

మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, తోట ప్రసాద్, సాయి మాధవ్ బుర్రా కథని అందిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏ వి ఏ ఎంటర్టైన్మెంట్ సంస్థలపై అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు.

నుపుర్ సనన్ ఇందులో హీరోయిన్ గా నటించాల్సి ఉండగా డేట్స్ అడ్జస్ట్ మెంట్ కారణంగా ఆమె మూవీ నుండి తప్పుకున్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. మరో హీరోయిన్‌ను త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు.

దీనికి సంబంధించిన షూటింగ్ త్వరలోనే మొదలు పెట్టనున్నారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు మూవీలో నటించబోయే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu