HomeTelugu News'మండే సూర్యుడు' గా ఆర్య!

‘మండే సూర్యుడు’ గా ఆర్య!

తెలుగు ,తమిళ్,మలయాళ భాషలలో రూపొందిన పలు సూపర్ హిట్ చిత్రాల్లో హీరో గా నటించిన ఆర్య ,సక్సెస్ ఫుల్ చిత్రాల క్రేజీ కథానాయిక హన్సిక జంటగా తమిళం లో రూపొంది బ్లాక్ బస్టర్ హిట్ గ నిలిచిన ”మీగా మాన్ ”చిత్రాన్ని సర్వల ఎంటర్టైన్మెంట్స్ మరియు శ్రీ సూర్య సాకేత్ పిక్చర్స్ తెలుగు లో “మండే సూర్యుడు” పేరుతో విడుదల చేస్తున్నారు.బెల్లంకొండ శ్రీ నిధి సమర్పణ లో బెల్లంకొండ వెంకటేశ్వర్లు,కొలన ఎల్లారెడ్డి,సర్వల గణేష్ యాదవ్ అనువదిస్తున్న ఈ సూపర్ హిట్ చిత్రానికి మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించారు.డ్రగ్ మాఫియా నేపథ్యం లో సాగే ఈ సినిమాలో ఆర్య స్టైలిష్ అండర్ కవర్ ఆఫీసర్ గా అద్భుతమైన పాత్రలో నటించారని,గ్లామర్ తో పాటు అభినయానికి స్కోప్ వున్నా పాత్రలో హన్సిక ఒక వైవిధ్యమైన రోల్ ప్లే చేసారని నిర్మాతలు తెలిపారు.తమిళం లో అఖండ విజయాన్ని సాధించి,హీరో ఆర్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమాలో ఇండియన్ డ్రగ్ మాఫియా నెటవర్క్ ఎలా ఉంటుంది?వారి ప్లన్స్ ఎలా ఉంటాయి?అనే అంశాలను ఎంతో రీసెర్చ్ చేసి దర్శకుడు మగిళ్ తిరుమేని సిల్వర్ స్క్రీన్ మీద అద్భుతంగా ఆవిష్కరించారని నిర్మాతలు తెలిపారు.హీరో ఆర్య 7 గురు విలన్ల మధ్య జరిగే ట్రాక్ సినిమాకి హైలైట్ అవుతుందని ,అతి త్వరలో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నామని చెప్పారు.ఆర్య,హన్సిక,ఆశుతోష్ రానా,సుధాంశు పాండే ,రమణ,ఆశిష్ విద్యార్థి,అనుపమా కుమార్,మహదేవన్,హరీష్ ఉత్తమన్,అవినాష్,శరవణ సుబ్బయ్య తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:ఎస్ ఎస్ తమన్,మాటలు:వెంకట్ మల్లూరి,పాటలు:వెన్నెలకంటి,భువన చంద్ర,నిర్మాణ నిర్వహణ :శ్రీనివాసు రెడ్డి,

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!