HomeTelugu Trendingఆడవాళ్లు మీకు జోహార్లు: 'మాంగళ్యం తంతునానేనా' లిరికల్‌ సాంగ్‌ విడుదల

ఆడవాళ్లు మీకు జోహార్లు: ‘మాంగళ్యం తంతునానేనా’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

Mangalyam Lyrical

టాలీవుడ్‌ యంగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈ సినిమా మార్చి 4న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. సినిమా విడుదలకు ఎక్కువ సమయం లేకపోవడంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. తాజాగా మూవీలోని నాల్గవ పాట ‘మాంగళ్యం’ను ఆవిష్కరించారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట ‘మాంగళ్యం తంతునానేనా’ అంటూ సాగుతూ…… పెళ్లి చేసుకోవాలని తహతహలాడుతున్న హీరో నిరాశను వ్యక్తం చేస్తుంది. అతని నిరాశకు కుటుంబం ఎలా అడ్డు పడుతుందన్న ఫ్రస్టేషన్ ను సాంగ్ ద్వారా వెల్లడించారు.

దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం అందించిన ఈపాటను జస్ప్రీత్ జాస్ ఆలపించారు. శర్వానంద్, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి, సత్య తదితరులు నటించిన ఈ పాట ఆకట్టుకుంటుంది. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.

కాజల్‌ సీమంతం ఫొటోలు వైరల్‌

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!