
Triptii Dimri Remuneration for Spirit Movie:
Prabhas హీరోగా నటించనున్న Spirit సినిమాపై ఇప్పుడు బోలెడంత చర్చ జరుగుతోంది. దీని అసలైన హైప్ Deepika Padukone ఎగ్జిట్ తర్వాత మొదలైంది. మొదట్లో ఈ సినిమా కోసం Deepika ని హీరోయిన్‌గా తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసింది. అసలు కారణం ఏమిటంటే… ఆమె భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట!
తాజా సమాచారం ప్రకారం Deepika ₹28 కోట్ల రెమ్యునరేషన్‌తో పాటు 15% ప్రాఫిట్ షేర్ కూడా అడిగిందట. అంతే కాకుండా షూటింగ్ షెడ్యూల్స్ మీద కఠినమైన షరతులు పెట్టిందట. ఈ విషయాలు డైరెక్టర్ Sandeep Reddy Vanga కు నచ్చలేదట. అందుకే ఆమెను రీప్లేస్ చేసేశారట.
View this post on Instagram
ఇక ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది Animal హీరోయిన్ Triptii Dimri. గత ఏడాది Animal సినిమాతో ప్రేక్షకుల మనసు గెలిచిన Triptii ఇప్పుడు Prabhas సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ వార్తను టీమ్ అధికారికంగా ప్రకటించింది కూడా. ఇది Triptiiకి Sandeepతో రెండో సినిమా కావడం విశేషం.
ఈ అవకాశంతో Triptii కెరీర్‌లో భారీగా రెమ్యునరేషన్ దక్కించుకుంది. Spirit సినిమాలో ఆమెకు రూ.6 కోట్లు పారితోషికంగా ఇవ్వనున్నారట. Deepika స్థానంలో ఈ అవకాశం Triptiiకు దక్కడం నిజంగా గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు.
ఇక Spirit సినిమా August 2025లో షూటింగ్ మొదలు కానుంది. ఇది ఒక భారీ బడ్జెట్ సినిమా – దాదాపు ₹400 కోట్లతో తెరకెక్కనుంది. Prabhas ఇందులో ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. థియేటర్ రిలీజ్ 2026లో ప్లాన్ చేస్తున్నారట.
ALSO READ: Sitaare Zameen Par విషయంలో 100 కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన అమీర్ ఖాన్