HomeTelugu News'మనవూరి రామాయణం' విడుదలకు సిద్ధం!

‘మనవూరి రామాయణం’ విడుదలకు సిద్ధం!

జాతీయ ఉత్తమనటుడు ప్రకాష్ రాజ్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ‘ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్, ఫస్ట్ కాపీ పిక్చర్స్’ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మనవూరి రామాయణం’.అక్టోబర్ 7న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం గురించిన వివరాల్లోకి వెళితే ….శ్రీ రామనవమి పండగరోజున జరిగే ఒక సంఘటనతో ఈ ‘మనఊరి రామాయణం’ చిత్ర కథ నడుస్తూ ఉంటుంది. ఈ కథ రామాయణం ఇతివృత్తానికి దగ్గరగా ఉంటుంది. రాముడి రూపంలో ఉండే రావణుడి కథే ఇది. ఈ చిత్ర కధనం అంతా కూడా వ్యక్తుల భావోద్వేగాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. భుజంగయ్య (ప్రకాష్ రాజ్) అనే వ్యక్తి దుబాయ్‌లో బాగా సంపాదించి వచ్చి ఇక్కడ ఓ ఊరిలో బిజినెస్‌ పెట్టుకుంటాడు. చిత్రం లో సుశీల (ప్రియమణి), ఆటోవాలా శివ (సత్యదేవ్) ల తో పాటు ఎప్పటికైనా భుజంగయ్య దుబాయ్‌కి పంపిస్తాడనే ఆశతో ఆటోవాలా ఉంటాడు. గరుడ అనే డైరెక్టర్‌కు (పృథ్వి) మంచి సినిమా తీయాలని వస్తాడు. భుజంగయ్య, సుశీల, ఆటోవాలా, గరుడ అనే నలుగురి మధ్య ఈ కథ నడుస్తూ ఉంటుంది. వీరిమధ్య నడిచే భావోద్వేగాలు, ఒక్కొక్కరు ఎవరికి వారు ఎలా తమ జీవితాన్ని తమ తమ పరిధిమేరకు నడిచారో, పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా మారారో తెలుపుతుంది.
ఈ నలుగురికి పాత్రల చుట్టూ తిరుగుతూనే రామాయణంలో జరిగిన సంఘటనలను గుర్తు చేస్తూ వారి వారి జీవితాలు నడుస్తూ ఉంటాయి. హరికథలో చెప్పిన విధంగా రావణుడు రాముడిగా మారినప్పుడు హనుమంతుడితో రాముడిని చంపమని సీత చెప్పినపుడు ఏమీ చేయలేని స్థితిలో ఉంటాడా..! రాముడిని చంపాడా..! అనే విధంగా ఈ పాత్రల చుట్టూ కథ నడుస్తూ ఉంటుంది అదే మనఊరి రామాయణం. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ‘యు’ సర్టిఫికెట్ పొందింది. ప్రముఖ చిత్ర డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘అభిషేక్’ పిక్చర్స్ ద్వారా అక్టోబర్ 7న రెండు తెలుగురాష్ట్రాల ప్రేక్షకులను అలరించటానికి ‘మనవూరి రామాయణం’ వస్తోందని తెలిపారు ‘ప్రకాష్ రాజ్’!

Recent Articles English

Gallery

Recent Articles Telugu