మరో బహిరంగ సభ ఏర్పాటు చేస్తోన్న పవన్!

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా విషయమై ప్రశ్నిస్తూ.. ఇప్పటికే తిరుపతి,
కాకినాడ వంటి ప్రాంతాల్లో బహిరంగ సభను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అలానే
మరో బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాడు. రాయలసీమలో వెనుకబడిన
ప్రాంతం, కరువుతో ఇబ్బంది పడుతోన్న అనంతపురం జిల్లాలోని ఈ బహిరంగ సభను ఏర్పాటు
చేస్తున్నాడు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే ఆ నిధులతో జిల్లాను కరువు నుండి ఎలా కాపాడుకోవచ్చు,
రాష్ట్రంలోని ఇతర సామాజిక సమస్యలు మొదలగు అంశాలపై ఈ సభలో మాట్లాడనున్నట్లు
తెలుస్తోంది. నిజానికి ఈ సభను అక్టోబర్ నెలలోనే ఏర్పాటు చేయాలనుకున్నారు కానీ
ఇండియన్ గవర్నమెంట్ సర్జికల్ స్ట్రైక్స్ లో నిమగ్నమై ఉండడం వలన నవబర్ కు వాయిదా
వేశారు. నవంబర్ 10న ఈ సభను నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటన విడుదల చేసింది.

CLICK HERE!! For the aha Latest Updates