నాగార్జున షాకింగ్ లుక్!

టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున.. ఆరు పదుల వయసుకి దగ్గర పడుతున్నా.. ఇంకా ఆయన అందంలో ఎలాంటి లోటు కనిపించడం లేదు. యంగ్ హీరోలకు పోటీగా తన అందాన్ని మైంటైన్ చేస్తుంటాడు. తన లుక్ కి, స్టయిల్ కి నాగార్జున చాలా ప్రాధాన్యం ఇస్తారు. అయితే ఈరోజు ఆయన లుక్ చూస్తే మాత్రం షాక్ అవ్వక తప్పదు. నాగార్జున నటించిన ‘రాజు గారి గది2’ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఈరోజు హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు వచ్చిన నాగ్ ను చూసిన వారంతా షాక్ కు గురయ్యారు. ఇదివరకెప్పుడూ కూడా నాగార్జున ఇలాంటి లుక్ తో దర్శనమివ్వలేదు. మీసాలు పూర్తిగా తీసేసి క్లీన్ షేవ్ తో నాగార్జున కనిపించారు. 
ఈ గెటప్ అతడికి పెద్దగా సెట్ కాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పోనీ నాగార్జున ఏమైనా.. కొత్త గెటప్ కోసం ప్రయత్నిస్తున్నాడా..? అంటే అదీకాదు. ఎందుకంటే ప్రస్తుతం నాగార్జున ఎలాంటి కొత్త సినిమాకు సైన్ చేయలేదు.