మరో రీమేక్ సినిమాలో సునీల్!

కమెడియన్ నుండి హీరోగా మారి వరుస చిత్రాలతో బిజీగా మారిపోయాడు సునీల్. అయితే
గత మూడు చిత్రాల నుండి ఆయనకు సరైన హిట్ సినిమా పడలేదు. కృష్ణాష్టమి, జక్కన్న,
ఈడు గోల్డ్ ఎహే ఇలా అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. అయినా సునీల్
మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం
సునీల్ మలయాళంలో హిట్ కొట్టిన ‘టూ కంట్రీస్’ సినిమా తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు.
ఈ సినిమాతో పాటు ఆయన మరో రీమేక్ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు
తెలుస్తోంది. రీసెంట్ గా తమిళంలో విడుదలయిన ‘ఇనకు ఇన్నోర్ పేర్ ఇరక్కు’ అనే చిత్రాన్ని
చూసిన సునీల్ తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. జీవీ ప్రకాష్ నటించిన
ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఈ కథలో కొన్ని మార్పులు, చేర్పులు
చేసి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఏ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్
లో ఈ సినిమాను నిర్మించనున్నారు.