నరేష్ రూట్ మారిస్తే బెటర్!

ఈ మధ్య కాలంలో మూస ధోరణిలో సినిమాలు చేసి విజయాలు అందుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గింది. అందుకే హీరోలు కూడా తన రూట్ మార్చి కంటెంట్ ఉన్న సినిమాలను ఎన్నుకుంటున్నారు. తమ పాత్రలు కూడా కొత్తగా ఉండేలా చూసుకుంటున్నారు. కానీ యంగ్ హీరో నరేష్ మాత్రం ఇంకా తన పాత పద్ధతిని విడిచి పెట్టడం లేదు. గతంలో ఆయన సినిమాలకు ప్రేక్షకాదరణ లభించేది. మినిమమ్ గ్యారంటీ హీరోగా నిర్మాతల దగ్గర మంచి పేరుండేది. కానీ రాను రాను ఈ పరిస్థితిలేకుండా పోతుంది.

టీవీ షోలు, యూట్యూబ్ లలో బెటర్ కామెడీ దొరుకుతున్నపుడు నరేష్ చేసే స్పూఫ్ ల కామెడీ కోసం థియేటర్ కు వెళ్ళి సినిమా చూసే వారు తగ్గిపోతున్నారు. పోనీ ఇప్పటికైనా హీరో గారు తన పంధాను మార్చుకున్నారా..? అంటే అది లేదు. తాజాగా తన అంకుల్ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో మరో కామెడీ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.

గతంలో సత్తిబాబు.. నరేష్ తో కలిసి ‘యముడికి మొగుడు’,’బెట్టింగ్ బంగార్రాజు’,’జంప్ జిలానీ’ వంటి కామెడీ సినిమాలను
తెరకెక్కించాడు. మరి మళ్ళీ అలాంటి కామెడీ సినిమానే తీస్తున్నాడా..? లేక అందులో ఏమైనా కొత్తదనం చూపిస్తున్నాడో.. చూడాలి!