మరో తెలుగు రీమేక్ లో సల్మాన్!

గతంలో పూరిజగన్నాథ్ రూపొందించిన ‘పోకిరి’ చిత్రాన్ని ‘వాంటెడ్’ పేరుతో హిందీలో రీమేక్ చేసి హిట్
కొట్టాడు సల్మాన్ ఖాన్. ఇప్పుడు మరో సినిమాను రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవల
పూరీ జగన్నాథ్, కల్యాణ్ రామ్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘ఇజం’ చిత్రానికి మంచి ఓపెనింగ్స్
వచ్చాయి. ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తే ఎలా ఉంటుందా..? అని సల్మాన్
ఆలోచిస్తున్నాడట. రీసెంట్ గా సినిమా చూసిన సల్మాన్ కు సినిమా బాగా నచ్చిందట.
దాంతో పూరీతో మాట్లాడడం, ఆయన ఈ విషయాన్ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారని
చెబుతున్నారు. త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలు
ఉన్నాయి. మరి బాలీవుడ్ లో ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్స్ ను దక్కించుకుంటుందో… చూడాలి!