ధనుష్ తో మరోసారి సోనమ్!

సోనమ్ కపూర్.. ఇప్పటివరకు బాలీవుడ్ చిత్రాల్లోనే మెరిసిన ఈ బ్యూటీ తొలిసారి ఓ తమిళ
చిత్రంతో దక్షిణాది ప్రేక్షకులను పలకరించనుంది. మంచి కథ దొరికితే సౌత్ లో నటిస్తానని
గతంలో స్టేట్మెంట్స్ ఇచ్చిన సోనమ్ కు ఇప్పుడు ఆ కథ దొరికినట్లు ఉంది. ధనుష్ హీరోగా
ఆయన మరదలు రజినీకాంత్ రెండో కూతురు సౌందర్య డైరెక్ట్ చేస్తోన్న సినిమాలో హీరోయిన్
గా సోనమ్ ను ఎన్నుకున్నారు. గతంలో సోనమ్, ధనుష్ తో కలిసి ‘రాంజనా’ అనే హిందీ సినిమాలో
నటించింది. ఇప్పుడు మరోసారి ఆయనతో జత కట్టనుంది. ఈ చిత్రానికి ‘నిలవుక్కు ఎన్ మెల్
ఎన్నడి కోబమ్’ అనే టైటిల్ ను ఖరారు చేయనున్నారు. మరి ఈ చిత్రంతో సోనమ్ కు ఎలాంటి
క్రేజ్ వస్తుందో.. చూడాలి!

CLICK HERE!! For the aha Latest Updates