మరోసారి పవన్ తో జతకట్టనుంది!

పవన్ కళ్యాణ్, సమంత జంటగా నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా ఎంతటి ఘన
విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి ఈ జంటను
తెరపై చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘కాటమరాయుడు’
సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వేసవి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమా
తరువాత పవన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి
‘దేవుడే దిగి వచ్చినా’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్ లో
రూపొందిస్తోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.
త్రివిక్రమ్ పై ఉన్న అభిమానంతో సమంత కూడా ఈ సినిమా అంగీకరించినట్లు సమాచారం.
 
 
 
 
CLICK HERE!! For the aha Latest Updates