కాజల్ పై అభిమానుల ఆగ్రహం!

ప‌వ‌న్‌, మ‌హేష్‌, చ‌ర‌ణ్‌, ప్ర‌భాస్‌ల‌పై కాజల్ సెటైర్లు కాస్తంత సీరియ‌స్ ఇష్యూ అవ్వ‌డం సామాజిక మాధ్య‌మంలో చ‌ర్చ‌కొచ్చింది. రీసెంటుగానే ఓ యూట్యూబ్ చానెల్ ఇంట‌ర్వ్యూలో కాజ‌ల్ చేసిన కామెంట్లను స‌ద‌రు హీరోల‌ ఫ్యాన్స్‌ సీరియ‌స్‌గా తీస్కుని సోష‌ల్ మీడియాలో పెద్ద సీనే క్రియేట్ చేస్తున్నారు. అస‌లింత‌కీ చంద‌మామ ఏమ‌ని కామెంట్ చేసిందేంటి?
 
”మహేష్ ఓ చాటర్ బాక్స్ అని.. త‌ను ఒక్కోసారి మాట్లాడటం ఆపేయాలి” అని స‌ల‌హా ప‌డేసింది. పవన్ గురించి  మాట్లాడుతూ -”పవన్ కొన్ని సమయాల్లో మాట్లాడటం నేర్చుకోవాలి” అని వ్యాఖ్యానించింది. ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. హైపర్ యాక్టివిటీని పెంచుకోవాలి అని సూచించింది. ఇక ప్రభాస్ పై పంచ్ వేస్తూ .. తనకు ఎనర్జీ కావాలి అని కామెంట్ చేసింది. ఒక్కొక్క‌రిలో ఒక్కో క్వాలిటీ గురించి కాజ‌ల్ సూచ‌న‌లు-స‌ల‌హాలు ఇవ్వ‌డం ఫ్యాన్స్‌లో కోప‌తాపాలుకు కార‌ణ‌మైంది. కాజ‌ల్ పై స‌ద‌రు హీరోల అభిమానులు విసుర్లు బాగానే విసురుతున్నారు.