సీటీమార్‌ నుంచి ‘పెప్సీ ఆంటీ’ సాంగ్‌ రిలీజ్‌

గోపీచంద్ – మిల్కీ బ్యూటీ తమన్నా హీరో,హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘సీటీమార్’‌. సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుని పొస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటుండగా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. కబడ్డీ ఆట నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతోంది. గోపీచంద్ ఏపీకి కోచ్‌గా .. తమన్నా తెలంగాణ కోచ్‌గా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్‌ని రిలీజ్ చేశారు. పక్కా మాస్ ఆడియన్స్ కోసమే మణిశర్మ మాంచి ఐటెమ్‌ సాంగ్‌ని కంపోజ్ చేశారనిపిస్తోంది. ‘నా పేరే పెప్సీ ఆంటీ’ అంటూ సాగే ఈ సాంగ్‌లో యంగ్ బ్యూటీ అప్సర రాణి స్టెప్పులేసింది. తాజాగా రిలీజైన ఈ సాంగ్ యూత్ అండ్ మాస్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటోంది.

CLICK HERE!! For the aha Latest Updates