‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్ షో కాదు!

శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌, ఇ.సత్తిబాబు కాంబినేషన్‌లో నవీన్‌చంద్ర హీరోగా నిర్మిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. శృతి సోది హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా టీజర్ ను సోమవారం హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ సంధర్భంగా.. నిర్మాత కె.కె. రాధామోహన్‌ మాట్లాడుతూ.. ”ఒక పాట మినహా ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ప్రేక్షకులకు హండ్రెడ్‌ పర్సెంట్‌ వినోదాన్ని అందించే హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. సత్తిబాబు చాలా ఎక్స్‌ట్రార్డినరీగా తీస్తున్నారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ మా బేనర్‌లో వస్తోన్న ఆరవ చిత్రం. ఇది గేమ్ షో కాదు. ఖచ్చితంగా సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది” అన్నారు.

దర్శకుడు ఇ.సత్తిబాబు మాట్లాడుతూ – ”ఆడియన్స్‌ కోరుకునే పూర్తి వినోదం ఈ కథలో వుంది. యూనిట్‌లోని ప్రతి ఒక్కరి సహకారంతో సినిమా మేం అనుకున్న దానికంటే బాగా వస్తోంది. ఒక ఐడియాకు కోటి రూపాయలు. ఆ ఐడియా చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. విజువల్ గా కూడా సినిమా బావుంటుంది. షూటింగ్ పూర్తయింది. పృధ్వీ, సలోనిల మీద ఒక పాట మాత్రం బ్యాలన్స్ ఉంది. అక్టోబర్ మూడవ వారంలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం” అన్నారు.

నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ”నాకు పెద్దగా కామెడీ టైమింగ్ లేదు. కానీ ఈ పాత్రకి నేనే సూట్ అవుతానని సెలెక్ట్ చేసుకున్నారు. రాధామోహన్ గారి ప్రొడక్షన్ లో పని చేయడం నా అధృష్టం. శృతి డెడికేషన్ ఉన్న ఆర్టిస్ట్. సత్తిబాబు గారు ప్రతి విషయాన్నీ దగ్గర ఉండి మరీ చూసుకున్నారు” అని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో శృతి, క్రాంతి, బాల్ రెడ్డి, పృధ్వీ తదితరులు పాల్గొన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates