
The Raja Saab Climax Details:
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ది రాజా సాబ్ డిసెంబర్ 5, 2025న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్-కామెడీ ఎంటర్టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన టీజర్‌కి సోషల్ మీడియాలో అద్భుత స్పందన లభిస్తోంది.
ఈ సందర్భంగా నిర్మాత టి.జి. విశ్వ ప్రసాద్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా క్లైమాక్స్‌పై కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. ఆయన చెప్పిన ప్రకారం –
“ఈ సినిమాకు మారుతి చేసిన ప్లానింగ్ అదిరిపోయింది. ఉదయం 6 నుంచి రాత్రి 10-11 వరకు షూటింగ్ చేశారు. ఇది ఏకంగా 120 రోజులు జరిగింది. ఈ మొత్తం షూటింగ్ ఓ క్లైమాక్స్‌కి మాత్రమే. ఆ సీన్ స్క్రీన్‌పై 40 నిమిషాల పాటు సాగుతుంది,” అని తెలిపారు.
తర్వాత VFX గురించి వివరించారు –
“ఈ క్లైమాక్స్ విజువల్స్‌కి VFX చాలా కీలకం. అందుకే 300 రోజుల పాటు గ్రాఫిక్స్ వర్క్ జరిగింది. ఇదంతా క్వాలిటీకి చేసిన జాగ్రత్త. అందుకే సినిమా ఆలస్యమైంది. అందరికీ నిరాశ కలిగిందని తెలుసు. కానీ మంచి కంటెంట్ ఇవ్వడమే మా లక్ష్యం,” అని పేర్కొన్నారు.
ఈ విషయాలతో సినిమా పైన అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఒకవైపు ప్రభాస్ స్టామినా, మరోవైపు క్లైమాక్స్‌లో ఉండబోయే విజువల్ ఎఫెక్ట్స్… అన్నీ కలిస్తే థియేటర్లలో విజువల్ ట్రీట్ ఖాయం అంటున్నారు అభిమానులు.
ఇక కథలో హారర్, కామెడీ, రొమాన్స్ కాంబోలో ది రాజా సాబ్ మరొక వేరియంటైన ప్రభాస్‌ను చూపించబోతున్నదని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ALSO READ: బాలీవుడ్ నటుడు Govinda కెరీర్ నాశనం వెనుక అసలు కారణం ఇదేనా?