‘సర్’ అంటే మాత్రం ఒప్పుకోనంటున్నాడు!

నాగార్జున ఇద్దరు కొడుకులు నాగచైతన్య, అఖిల్ లు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఇప్పటికే అఖిల్ కు తన ప్రేమించిన అమ్మాయి శ్రియాభూపాల్ తో నిశ్చితార్ధం జరిగింది. అలానే చైతు, సమంతల నిశ్చితార్ధం కూడా ఈ నెలాఖరున జరగనుందని సమాచారం. అయితే తన ఇద్దరి కోడళ్ళు పెళ్ళైన తరువాత నాగ్ ను ఏమని సంభోదిస్తారనే విషయంపై నాగ్ తెగ ఆలోచిస్తున్నాడట. అఖిల్ కు కాబోయే భార్య శ్రియభూపాల్ మొదటినుండి ఫ్యామిలీ ఫ్రెండ్ కావడంతో నాగార్జునను ఎప్పుడు నాగ్ మామ అని పిలుస్తుందట.

సో.. పెళ్ళైన తరువాత కూడా ఆమె నాగార్జునను మామ అనే పిలుస్తుంది కాబట్టి సమస్య లేదు. కానీ పెద్ద కోడలు సమంతకు మాత్రం నాగార్జునను నాగ్ సర్ అని పిలవడం అలవాటు. దీంతో పెళ్ళైన తరువాత కూడా అలానే పిలుస్తుందా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. నాగార్జున మాత్రం తనను సర్ అంటే మాత్రం ఒప్పుకోనని అంటున్నాడు. మరి ఇప్పుడు సామ్ ఏమని పిలుస్తుందో.. అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!