HomeTelugu Trendingమెగా ప్రిన్సెన్‌కు కనుకగా ముఖేశ్‌ అంబానీ బంగారు ఊయల

మెగా ప్రిన్సెన్‌కు కనుకగా ముఖేశ్‌ అంబానీ బంగారు ఊయల

mega princess Special Day

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్.. ఉపాసన దంపతులు జూన్ 20వ తారీకున అమ్మాయికి జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ఈ రోజు బేబీ బారసాల కార్యక్రమం మరియు పేరు పెట్టే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉపాసన తల్లి ఇంట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఇండస్ట్రీకి చెందిన వారు అంటున్నారు. దీంతో పాప పేరు పై మెగా ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది.

నేడు సాయంత్రం వరకు మెగా ప్రిన్సెస్ యొక్క పేరు కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. పాప పుట్టిన వెంటనే చాలా మంది జోతిష్యులు మాట్లాడుతూ అద్భుతమైన జాతకం అన్నారు. తాత చిరంజీవి యొక్క అంశ అన్నారు. మరోవైపు ఓ వార్త ఉదయం నుంచి మీడియాలో హల్ చేస్తోంది. చరణ్ కూతురుకి ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ బంగారు ఊయలను కానుకగా పంపించారనేదే ఆ వార్త.

ఈ ప్రచారంపై రామ్ చరణ్ టీమ్ స్పందించింది. ఈ వార్తలో నిజం లేదని స్పష్టం చేసింది. ప్రజ్వల ఫౌండేషన్ వాళ్లు బహూకరించిన చెక్క ఊయలనే ఈ కార్యక్రమంలో వినియోగిస్తున్నట్టు తెలిపారు. ఈ ఊయలను మెషీన్ తో కాకుండా చేతితోనే తయారు చేశారు.

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

మెగాస్టార్‌ చిరంజీవి భోళాశంకర్‌ టీజర్‌

రామ్‌ గోపాల్‌ వర్మ వివాదస్పద చిత్రం వ్యూహం టీజర్‌

సామజవరగమ మూవీ ట్రైలర్‌

రుద్రంగి మూవీ ట్రైలర్‌

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu