HomeTelugu Trendingఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ పేరు.. చిరంజీవి స్పందన

ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ పేరు.. చిరంజీవి స్పందన

Chiru tweet on CM Jagan dec

కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నూతనంగా నిర్మించిన ఎయిర్‌పోర్టుకు స్వాతంత్ర్య సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును నిర్ణయించినట్లు సీఎం జగన్ ప్రకటించారు. కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్‌తో కలిసి గురువారం ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును సీఎం జగన్ ప్రారంభించారు. ఈ గడ్డ నుంచే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వచ్చారని.. గాంధీజీ, వల్లభాయ్ పటేల్ కంటే ముందుగానే బ్రిటీష్ వారికి ఎదురు తిరిగిన పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అన్నారు. అందుకే ఆయన పేరు పెడితే
బాగుంటుందని నిర్ణయించినట్లు తెలిపారు. రూ.110 కోట్లతో ఏడాదిన్నరలోనే నిర్మాణం పూర్తిచేసినట్లు సీఎం జగన్ తెలిపారు. ఈనెల 28 నుంచి కర్నూలు ఎయిర్‌పోర్టు నుంచి విమాన రాకపోకలు సాగనున్నాయి. ముందుగా చెన్నై, విశాఖ, బెంగళూరుకు విమాన రాకపోకలు ఉంటాయి.

మరోవైపు ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. కర్నూల్ ఎయిర్‌పోర్ట్‌కు మన దేశపు మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును ప్రకటించటం చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు. సీఎం జగన్‌ను హృదయ పూర్వకంగా అభినందిస్తున్నట్లు చిరంజీవి ట్వీట్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu