HomeTelugu Trendingసైంధవ్‌: 'బుజ్జికొండవే' ఎమోషనల్‌ సాంగ్‌ విడుదల

సైంధవ్‌: ‘బుజ్జికొండవే’ ఎమోషనల్‌ సాంగ్‌ విడుదల

Bujjikondave Lyrical from S
విక్టర్‌ వెంకటేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్‌’. శైలేష్‌ కొలను డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాని బోయనపల్లి నిర్మిస్తున్నారు. వెంకటేష్‌ నటిస్తున్న 75వ మూవీగా వస్తున్న ఈ సినిమా ఆయన కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌కు రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో సైంధవ్ టీమ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.

తాజాగా మూవీ నుంచి థ‌ర్డ్ సింగిల్ ‘బుజ్జికొండవే’ లిరికల్‌ వీడియోను విడుద‌ల చేశారు. ఈ పాట చూస్తే.. వెంకీ, కూతురు మధ్య ఎమోష‌న‌ల్‌గా ఈ పాట ఉండ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. ఈ పాట మనస్సుని హాతుకునేలా ఉంది. S. P చరణ్ ఆలపించిన ఈపాట సినిమాకే హైలైట్‌ అవుతుంది అని అంటున్నారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. సంతోష్ నారాయణన్ సంగీతం స‌మ‌కూర్చాడు.

చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్‌ ఏరియా బ్యాక్‌డ్రాప్‌ మిషన్‌ నేపథ్యంలో సాగుతున్న ఈ మూవీలో జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్‌ యాక్టర్‌ నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu