నితిన్ సరసన తమిళ్ బ్యూటీ!

నితిన్ ‘అ ఆ’ సినిమా సక్సెస్ తరువాత హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధపడ్డాడు. 14 రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా ఎనభై శాతం అమెరికా నేపధ్యంలో సాగుతుంది. దీనికోసం ఇటీవల హను అమెరికాకు వెళ్ళి లొకేషన్స్ ను ఫైనల్ చేసుకొని వచ్చాడు.

ఈలోగా నితిన్, పవన్ కల్యాణ్ బ్యానర్ లో కృష్ణచైతన్య దర్శకత్వంలో నూతన సినిమా ప్రారంభ పూజా కార్యక్రమాలు నిర్వహించేశాడు. అయితే ఈ రెండు సినిమాలు ఏకకాలంలో సెట్స్ పైకి తీసుకు వెళ్తారా..? లేక మొదట హను సినిమా పూర్తి చేస్తారా..? అనే విషయంలో స్పష్టత రావాల్సివుంది.

అయితే నితిన్, హను ల సినిమాలో హీరోయిన్ గా తమిలమ్మాయి మేఘా ఆకాష్ ను ఎంపిక చేశారు. ఆమె ఇదివరకే ధనుష్ తో తమిళంలో ఓ సినిమా చేసింది. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక తెలుగులో నితిన్ సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్న ఈ బ్యూటీకి ఈ సినిమా ఎంతవరకు కలిసొస్తుందో.. చూడాలి!