మెహ్రీన్ ను కావాలనే తప్పించారా..?

కృష్ణగాడి వీరప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ కౌర్ మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుంది. ఆ వెంటనే బాలీవుడ్ కు వెళ్ళి ఫిల్లౌరి సినిమా చేసి అక్కడ కూడా తన మార్క్ ను క్రియేట్ చేసుకుంది. తాజాగా టాలీవుడ్ లో అమ్మడుకి వరుస అవకాశాలు చుట్టుముట్టాయి. రవితేజతో ‘రాజా ది గ్రేట్’ సినిమా చేస్తోన్న ఈ బ్యూటీ సందీప్ కిషన్ తో ఓ సినిమా చేయడానికి అంగీకరించింది. అలానే సాయి ధరం తేజ్ తో ‘జవాన్’, వరుణ్ తేజ్ కొత్త సినిమా కోసం, అల్లు శిరీష్ తదుపరి సినిమా కోసం కూడా అమ్మడు పేరునే ఫైనల్ చేసుకున్నారు.
 
దీంతో ఇక మెహ్రీన్ టాలీవుడ్ లో తన చక్రం తిప్పుతుందని అనుకున్నారు. కానీ సడెన్ గా అమ్మడు చిక్కుల్లో పడింది. మెగాహీరోలతో అనుకున్న మూడు ప్రాజెక్టుల నుండి మెహ్రీన్ తప్పుకుంది. అసలు ఆమె తప్పుకుందా..? లేక తప్పించారా..? అనే విషయం అంతుపట్టకుండా ఉంది. డేట్లు అడ్జస్ట్ చేయకపోవడమే కారణం అని చెబుతున్నా.. కెరీర్ ఇప్పుడే ఆరంభించిన ఈ బ్యూటీ డేట్స్ కేటాయించలేకపోతోంది అనే మాట నమ్మశక్యంగా లేదు. అసలు కారణం చెప్పలేదు గానీ అమ్మడు స్థానంలో సాయేషా సైగల్, అను ఎమ్మాన్యూయల్ వంటి హీరోయిన్లను తీసుకునే పనిలో ఉన్నారు.