HomeTelugu Trending'ఆహా'లో ఆగస్టు 14న 'మెట్రో కథలు'

‘ఆహా’లో ఆగస్టు 14న ‘మెట్రో కథలు’

Metro Kathalu release in ah 1
‘ఆహా’లో మరో కొత్త వెబ్‌ చిత్రం విడుదల కానుంది. కరుణాకర్‌ దర్శకత్వంలో ‘మెట్రో కథలు’ అనే వెబ్‌ సీరిస్‌ రాబోతుంది. వన్‌ సిటీ.. ఫోర్‌ స్టోరీస్‌ అనేది ఉప శీర్షక. తాజాగా ఈ వెబ్‌ మూవీ టీజర్‌ను డైరెకర్ట్‌ మారుతీ రిలీజ్‌ చేశారు. ఇందులో రాజీవ్‌ కనకాల, సన, అలీ రెజా, నందిని రాయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఒక నగరంలో ఉండే నలుగురి జీవితాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. ప్రేమ, బాధ, సంతోషం వంటి నిత్య జీవితంలో ఉండే కష్టసుఖాలే నేపథ్యంగా ఈ చిత్రం ఉండనుంది. మహ్మద్‌ ఖాదీర్‌ బాబు కథ అందించగా.. అజయ్‌ అర్సదా సంగీతం సమకూర్చారు. కిరణ్‌రెడ్డి మందాడి, రామ్‌ మద్దుకూరి నిర్మాతలు. ఈ వెబ్‌ చిత్రం ‘ఆహా’లో ఆగస్టు 14న విడుదల కానుంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu