Homeతెలుగు Newsమోడీ మా పేర్లూ మార్చేస్తారేమో!

మోడీ మా పేర్లూ మార్చేస్తారేమో!

‘ప్రధాని మోడీ ఊళ్ల పేర్లనే కాదు.. మా పేర్లు కూడా ఎక్కడ మార్చేస్తారో అని ముస్లింలు భయపడిపోతున్నారు.. ఎప్పుడేం చేస్తాడో అని ఉత్తరాది ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అందరమూ ప్రధాని పిల్లలమే.. కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆయనే ఇలా చేస్తే ఎలా? మేం కూడా ఈ దేశంలో పుట్టిన వాళ్లమేగా? ‘అని మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన ఓ ప్రముఖ ఛానల్‌తో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు నాయకత్వం దేశానికి అవసరమని స్పష్టం చేశారు. దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలో ఉండకూడదనే లక్ష్యంతోనే ఆయన కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నారన్నారు.

10 4

మైనార్టీ సంక్షేమం అనేది తన ఆలోచనల నుంచి పుట్టిందేనని ఫరూక్‌ పేర్కొన్నారు. ఆ శాఖతో పాటు వైద్యవిద్య, ఎన్టీఆర్‌ వైద్యసేవ బాధ్యతలు అప్పగించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ముస్లిం యువతకు స్వయం ఉపాధి పథకాలు విస్తృతంగా అమలు చేయాల్సి ఉందన్నారు. తాను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన పట్టణ ముస్లిం మహిళల అభివృద్ధి పథకాన్ని మళ్లీ తీసుకురావాలనే ఆలోచన ఉందన్నారు. దీనిపై సీఎం చంద్రబాబుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. చదువుకోకున్నా ముస్లిం యువతలో ఎంతో నైపుణ్యం ఉందన్నారు. వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తే కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో న్యాక్‌(నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కనస్ట్రక్షన్‌) సంస్థ ఏర్పాటులో తన భాగస్వామ్యాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. అక్కడ శిక్షణ పొందిన వారిలో 3.5లక్షల నుంచి 4లక్షల మంది విదేశాలకు వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. అమరావతిలోనూ అలాంటిది ఏర్పాటుచేస్తే ఎంతోమందికి ఉపాధి లభిస్తుందన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu