మిస్ వరల్డ్ గా మెక్సికో యువతి

2018 మిస్ వరల్డ్ గా మెక్సికోకు చెందిన వెనెస్సా పోన్స్ డీ లియోన్ ఎంపికైంది. సాయంత్రం చైనాలోని సన్యా సిటీలో జరిగిన 68వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు. రన్నరప్‌గా థాయ్‌లాండ్‌కు చెందిన నికోలిన్‌ లిమ్స్‌నుకన్‌ నిలిచింది. 2017 ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌ తన వారసురాలికి కిరీటాన్ని పెట్టి, అభినందనలు తెలిపారు. మొత్తం 118 మంది పాల్గొన్న ఈ అందాల పోటీల్లో భారత్‌కు చెందిన అనుకృతి వ్యాస్‌ టాప్‌ 30లో చోటు సంపాదించుకుంది. మెక్సికోకు చెందిన వెనెస్సా ఇంటర్నేషనల్‌ బిజినెస్‌లో డిగ్రీ పూర్తి చేసి.. ప్రస్తుతం మోడల్‌గా రాణిస్తోంది. పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది.