మ‌హిళా శ‌క్తికి నిద‌ర్శ‌నం: మోహన్ బాబు!

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌గారి ప్ర‌స్థానం అంద‌రికీ స్ఫూర్తిదాయకం. గొప్ప జ‌నాక‌ర్ష నేత‌,
అంత కంటే గొప్ప మ‌న‌సున్న వ్య‌క్తి, మ‌హిళా శ‌క్తికి నిద్శ‌నం జ‌య‌ల‌లిత‌గారు. నా కెరీర్ ప్రారంభంలో
ఆమెను చాలా సార్లు క‌లిసి మాట్లాడాను. క‌లిసిన ప్ర‌తిసారి గొప్ప అదృష్టంగా భావించాను.  గొప్ప న‌టి,
రాజ‌కీయ నాయ‌కురాలు. జ‌య‌ల‌లిత‌గారి మ‌ర‌ణం త‌మిళ సోద‌రీ సోద‌రీమ‌ణుల‌కు తీర‌నిలోటు. ఆమె
మ‌న‌ల్ని విడిచిపెట్టి వెళ్ల‌డం చాలా బాధాక‌రం. మాట‌లు రావ‌డం లేదు. ఆమె ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని
ఆ దేవుని ప్రార్థిస్తున్నాను.