HomeTelugu Trending'మొనగాడు' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్

‘మొనగాడు’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్

3 6
కొత్త హీరో హీరోయిన్లు వంశీ ఆకుల, పావని నటిస్తున్న చిత్రం మొనగాడు. ఈ చిత్రంలో మగధీర ఫేం దేవ్‌గిల్ విలన్‌గా నటించడం హైలైట్. ఈ సినిమాలో చత్రపతి శేఖర్ మరో విలన్‌గా కనిపించనున్నాడు. తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నేడు ఈ చిత్రం నుంచి మోషన్ పోస్టర్ విడుదలైంది. దీనికి సినీ ప్రముఖులతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. క్వాలిటీ పరంగా సినిమాపై మంచి అంచనాలున్నాయి. సింగిల్ కట్‌ లేకుండా సెన్సార్‌ నుంచి U/A సర్టిఫికెట్ తీసుకున్న ‘మొనగాడు’ చిత్రానికి ర్యాప్ రాక్ షకీల్ సంగీతం అందిస్తున్నాడు. ఎడిటింగ్ : బొంతల నాగేశ్వర రెడ్డి. నిర్మాత, దర్శకత్వం ఆకుల వంశీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu