HomeTelugu Trending'ఛత్రివాలి' నుంచి రకుల్‌ ఫస్ట్‌లుక్‌

‘ఛత్రివాలి’ నుంచి రకుల్‌ ఫస్ట్‌లుక్‌

Rakul Preet unveils her boldest film ever
రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నతాజా చిత్రం ‘ఛత్రివాలి’ నుంచి అప్‌డేట్‌ ఇచ్చింది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో ఫస్ట్‌ లుక్‌ను తన ఇన్‌స్టా గ్రామ్‌ ద్వారా విడుదల చేసింది రకుల్‌. ‘ఎలాంటి వాతవరణ సూచన లేకుండా వర్షం కురుస్తుంది.. మీ గొడుగును సిద్ధంగా ఉంచుకోండి’ అంటూ క్యాప‍్షన్‌ పెట్టింది. ఈ చిత్రానికి తేజస్ ప్రభ విజయ్ దేవస్కర్‌ దర్శకత్వం వహించగా రోని స్క్రీవ్‌వాల వారి ఆర్‌ఎస్‌వీపీ సంస్థ నిర్మిస్తోంది.

ఈ సినిమాలో రకుల్‌ కండోమ్‌ టెస్టర్‌ పాత్రలో కనిపించబోతున్నారు. ఒక చిన్న పట్టణంలో కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్‌ పూర్తి చేసి నిరుద్యోగి మహిళ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఆమెకు కండోమ్‌ టెస్టర్‌గా ఉద్యోగం ఎలా దొరికింది. ఆమె తన చుట్టు ఉన్నవాళ్ల నుంచి ఎలాంటి రహస్యాలను దాచింది అనేదే స్టోరీ. ఒక కొత్త కథ, చమత్కారమైన డ్రామాను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు ‘ఛత్రివాలి’ చిత్ర బృందం.

‘ఇది చాలా ఆసక్తికరమైన, కొత్త రకమైన కథ. నా పాత్రను ప్రారంభించినందుకు నేను చాలా థ్రిల్‌ ఫీల్‌ అవుతున్నాను. తేలికైన పద్ధతిలో కొన్ని సమస్యలను హైలెట్‌ చేసి చూపించడం ముఖ్యం. ఇది నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది.’ అని రకుల్‌ తన భావాలను పంచుకుంది. చిత్ర నిర్మాత తేజస్‌ దేవస్కర్‌ మాట్లాడుతూ ‘మా చిత్రం ఒక సోషల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఇది కండోమ్‌ల వాడకాన్ని ప్రధానాంశంగా చూపించాం. సినిమా విడుదల పట్ల ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాం. రకుల్ ఆమె పోషించే ప్రతి పాత్రకు కొత్తదనాన్ని తీసుకొస్తుంది. ఇలాంటి సున్నితమైన, ఆలోచింపజేసే సబ్జెక్ట్‌తో ఉన్న ఈ కామెడీ రోలర్‌-కోస్టర్‌ రైడ్‌ను ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్‌ చేస్తారు.’ అన్నారు. కాగా, రకుల్ ‘ఛత్రివాలి’తో పాటు ‘మేడే’, ‘డాక్టర్ జి’, ‘థ్యాంక్ గాడ్’ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!