ప్రియాంకకు అరుదైన అవార్డ్!

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తానూ చేస్తున్న సామాజిక సేవలకు గాను మదర్ థెరిస్సా అవార్డు దక్కింది. ఇప్పటికే యునిసెఫ్ కి గుడ్ విల్ అంబాసిడర్ గా ఉన్న ప్రియాంక అనేక సోషల్ సర్ఫీస్ లు చేస్తుంటుంది. అయితే హాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో యూఎస్ లో బిజీ గా ఉన్న ప్రియాంక ఈ జ్ఞాపికని అందుకునేందుకు ఇక్కడికి రాలేకపోవడంతో ఈమెకి బదులుగా ప్రియాంక తల్లి మధు చోప్రా మదర్ థెరిస్సా అవార్డు అందుకున్నారు.

ఉత్తరప్రదేశ్ లో బరైలీ ప్రాంతంలో ఉన్న ప్రేం నివాస్ అనే వృద్దాశ్రమానికి ప్రియాంక విరాళాలు కూడా ఇచ్చింది. ఇంతగా సేవలు అందిస్తున్న ప్రియాంక ఈ అవార్డుకు అర్హురాలే అని మధుచోప్రా అన్నారు. కూతురికి దక్కిన గౌరవానికి తల్లి చాలా మురిసిపోయింది. ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్నది.