నిర్మాతలే భావనపై కక్ష కట్టారా..?

మలయాళ నటి భావనను కొందరు ఆకతాయిలు లైంగిక వేధింపులకు గురిచేయడం దానిపై ఆమె పోలీస్ కంప్లైంట్ చేసిన సంగతి విధితమే. అయితే ఈ కేసు విచారిస్తున్న పోలీసులకు ఈ విషయం వెనుక సినీ పరిశ్రమ కు చెందిన కొందరు పెద్ద వాళ్ళ హస్తం ఉందని తెలుసుకున్నట్లుగా టాక్. ఆ పెద్దలు కావాలనే భావనను టార్గెట్ చేసి ఆమెపై అఘాయిత్యం చేయించిన్నట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. భావన తీరు నచ్చని కొందరు కావాలనే కారు డ్రైవర్లను, కొందరు రౌడీలను జత చేసి ఆమెపై వేధింపులకు పాల్పడేలా చేశారని సమాచారం.
రౌడీల కాల్ లిస్ట్ ను పరిశీలించగా భావనను వేధించిన తరువాత వీరు మలయాళ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నిర్మాతలకు ఫోన్ చేసి మాట్లాడారని అంచనాకు వచ్చారు. అయితే ఇప్పుడు భావనకు నిర్మాతలతో పాటు కొందరు స్టార్ హీరోలతో సైతం విబేధాలు ఉన్నాయనే విషయం చర్చలకు దారితీసింది. ఇంతకీ ఇంతటి దారుణానికి తలపడాల్సినంత అవసరం ఎవరికి వచ్చింది..? దీని వెనుక బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే విషయాలు పోలీసుల విచారణలో తెలిసే అవకాశాలు ఉన్నాయి. 
 
 
Attachments