HomeTelugu Trendingబ్రో : ఫస్ట్‌ సాంగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన థమన్‌

బ్రో : ఫస్ట్‌ సాంగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన థమన్‌

my dear markandeya update f

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రో’. తమిళ నటుడు సముద్రఖని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. యంగ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఈ సినిమాలో మరో లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. జులై 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఎస్ థమన్ టీం మ్యూజికల్ బ్లాస్ట్‌ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. తాజాగా బ్రో ఫస్ట్‌ సింగిల్‌ అప్‌డేట్‌ అందించాడు థమన్‌‌.

ఫస్ట్ సాంగ్ మై డియర్ మార్కండేయ లోడింగ్ అంటూ ట్వీట్ చేశాడు. ఇంతకీ ఎప్పుడు లాంఛ్ చేసేది మాత్రం సస్పెన్స్‌లో పెట్టేశాడు. ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్‌, కేతిక శర్మ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్లభరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తుండగా.. వివేక్‌ కూచిబొట్ల కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తెలుగు నేటివిటీకి అనుగుణంగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మార్పులు చేసినట్టు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!