ధనుష్ భార్య ఆధిపత్యం చూపిస్తుందట!

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కుమార్తె ఐశ్వ‌ర్య‌ను పెళ్లాడాడు నటుడు ధ‌నుష్‌. హీరోగా కెరీర్ ఆరంభం ర‌జ‌నీ అల్లుడు అంటే తెగ ఇదైపోయేవాడిన‌ని ఇటీవ‌లే ధ‌నుష్ రివీల్ చేశాడు. అలా పిలిస్తే ఇప్ప‌టికీ బాధ‌ప‌డ‌తాన‌ని అన్నాడు. త‌న‌కు తానుగా ఎద‌గ‌డం అంటేనే ఇష్టమని స్ప‌ష్టం చేశాడు. అంతేకాదు.. త‌న భార్య అంటే త‌న‌కు ఉన్న ఇష్టాన్ని ధ‌నుష్ వెల్ల‌డించాడు. ”పిల్ల‌ల్ని నేను పెంచుతాను.. నీ కెరీర్ కోసం ఏదైనా చెయ్‌.. అని అన్నాన‌ని.. అందుకు త‌ను స‌సేమిరా అంద‌ని” తెలిపాడు. ఇక త‌న‌కి
బెస్ట్ ఫ్రెండ్ త‌న భార్య ఐశ్వ‌ర్య‌నేన‌ని, త‌ను ఏ ప‌ని చేసినా ఆధిప‌త్యం చూపిస్తుంద‌ని తెలిపాడు.

‘3’ అనే సినిమాతో ఐశ్వ‌ర్య‌ ద‌ర్శ‌కురాలిగా మారారు. అంత‌కంటే ముందే 2003లో న‌ట్పే న‌ట్పే.. అనే ఓ పాట‌ను పాడారు. నేప‌థ్య గాయ‌నిగా ప్ర‌యత్నించి అటుపై ద‌ర్శ‌కురాల‌య్యారు. అటుపై ‘వాయ్ రాజా వాయ్’ అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ధ‌నుష్-ఐశ్వ‌ర్య దంప‌తుల‌కు యాత్ర , లింగ అనే ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. ప్ర‌స్తుతం ఐశ్వ‌ర్య నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా ‘మ‌రియ‌ప్ప‌న్‌’ అనే సినిమా తెర‌కెక్కిస్తున్నారు. 21 ఏళ్ల హై జంప‌ర్ జీవిత క‌థ ఇది.