సర్కారు వారి పాటపై మేకర్స్ ప్రకటన

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పరుశురాం డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. దీంతో షూటింగ్ కాస్తా వాయిదా పడింది. దుబాయ్ షెడ్యూల్ సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసింది సర్కారు వారి పాట యూనిట్. అయితే అందులో యాక్షన్ సీక్వెన్స్‌లు, హీరోయిన్ కీర్తి సురేష్‌తో రొమాంటిక్ సీన్లు కూడా పూర్తిచేసినట్టు తెలుస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా సర్కారు వారి పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ మూవీకి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ వస్తుందనే ఆశతో అభిమానులు ఎదురుచూస్తున్నారు.

తాజాగా సర్కారు వారి పాట మూవీయూనిట్‌ నుండి అధికారికంగా ప్రకటన చేశారు. “సర్కారు వారి పాట షూటింగ్ మొదలైన వెంటనే అప్డేట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. అంతవరకూ అందరూ జాగ్రత్తగా ఉండండి.. కోవిడ్ ప్రోటోకాల్ పాటించండి” అంటూ పిలుపునిచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ – 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ తో పాటు మహేష్ కూడా నిర్మిస్తున్నాడు.

CLICK HERE!! For the aha Latest Updates